అర్జీల వెల్లువ
పట్టించుకోవడం లేదు
నా పేరు చిటిమెల్ల నర్సబాయి. జైనథ్ మండలంలోని భోరజ్ గ్రామం. నాకు గ్రామ శివారులోని సర్వే నంబర్ 28లో ఎకరం భూమి ఉంది. 1995 నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నా. కానీ ధరణి వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. తహసీల్దార్‌కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.
● గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్
● ఈ వారం ప్రజావాణికి 78 అర్జీలు
కై లాస్‌నగర్: పింఛన్ మంజూరు చేయాలని ఒకరు... స్వయం ఉపాధి కల్పించాలని మరొకరు.. భూ సమస్య పరిష్కరించాలని ఇంకొకరు.. ఇలా వివిధ సమస్యలతో తరలివచ్చిన అర్జీదారులు తమ గోడును జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని దేశించారు. ఆయా సమస్యలపై ఈ వారం మొత్తం 78 అర్జీలు అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా పింఛన్‌కు సంబంధించినవే ఉండడం గమనార్హం. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..
Comments
Please login to add a commentAdd a comment