ముగిసిన డేటా ఎంట్రీ ప్రక్రియ
● రాష్ట్రంలో రెండో స్థానంలో ఆదిలాబాద్
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి వంద శాతం కుటంబాల వివరాలను ఆపరేటర్లు సమగ్ర సర్వే వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 2,25,257 కుటుంబాలున్నట్లుగా హౌస్ లిస్టింగ్ సర్వేలో అధికారులు గుర్తించారు. ఎన్యుమరేటర్లు ఆ కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంటింటి సర్వే ద్వారా సేకరించారు. గత నెల 22 నుంచి సమగ్ర కుటుంబ సర్వే వెబ్‌సైట్‌లో వివరాల నమోదును ప్రారంభించిన ఆపరేటర్లు తమకు కేటాయించిన దరఖాస్తులను వంద శాతం పూర్తి చేశారు. అన్ని మండలాల్లోనూ పూర్తి కాగా రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ఈ ప్రక్రియలో రెండో స్థానంలో నిలిచినట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రథమ స్థానంలో ములుగు జిల్లా ఉండగా చిట్టచివరి స్థానంలో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ నిలిచినట్లుగా పేర్కొన్నారు. ఈ సర్వే ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచి ఇతర అన్ని కేటగిరీలను ఖరారు చేయనుందనే అభిప్రాయాన్ని అధికారులు వెలిబుచ్చుతున్నారు.
మండలం ఎంట్రీ పూర్తయిన
కుటుంబాలు
మావల 1,758ఆదిలాబాద్‌రూరల్ 11,536
జైనథ్ 8,370
భీంపూర్ 7,795
బజార్‌హత్నూర్ 9,620
సిరికొండ 5,652
భోరజ్ 6,310
నేరడిగొండ 9,620
ఇంద్రవెల్లి 12,160
తాంసి 5,533
బోథ్ 11,279
బేల 10,236సాత్నాల 4,207
ఉట్నూర్ 19,099సొనాల 4,286
గాదిగూడ 6,739
గుడిహత్నూర్ 10,179
ఇచ్చోడ 13,976
తలమడుగు 11,456
నార్నూర్ 9,221
ఆదిలాబాద్‌అర్బన్ 46,225
Comments
Please login to add a commentAdd a comment