‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ రాజర్షి షా
కైలాస్‌నగర్: పదోతరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీ ర్ణత సాధించేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్ర త్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పది విద్యార్థుల ప్రయోజనార్థం రూపొందించిన తెలుగు, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుల అభ్యాస దీపికలను సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షలపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించాలన్నారు. ఈ మేరకు అభ్యాసదీపికలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. ఇందులో పొందుపర్చిన ము ఖ్యాంశాలు, సూచనలు పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా చదివి పరీక్షల్లో విజయం సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆదిశగా సన్నద్ధమయ్యేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత పాల్గొన్నారు.
విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
ఆదిలాబాద్‌టౌన్: విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రో త్సహించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రిమ్స్‌లో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్‌ను సోమవా రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోగులు, వారి సహాయకులకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో పార్లర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. త్వ రలోనే ఆదిలాబాద్ బస్టాండ్‌లోనూ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయ డెయి రీ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రావు, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, డెయిరీ మేనేజర్ తుషార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment