సైబర్ బాధితులకు అండగా ఉంటాం
● ఎస్పీ గౌస్ ఆలం ● సైబర్ క్రైమ్ కార్యాలయం ప్రారంభం
ఆదిలాబాద్‌టౌన్: సైబర్ బాధితులకు అండగా ఉంటూ న్యాయం చేకూర్చేలా పోలీసుశాఖ ప్రత్యేక చ ర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీసు కార్యాలయంలో నూతన సైబర్‌క్రైమ్ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సైబర్ బారిన పడిన వెంటనే టోల్‌ఫ్రీ నం.1930కు సమాచారం అందించాలన్నారు. అలాగే సైబర్‌క్రైమ్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈమేరకు ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్న ట్లు తెలిపారు. ఈఏడాది జిల్లాలో సైబర్ బారిన పడిన 90 మంది బాధితులకు రూ.17,62,381 ల ను తిరిగి న్యాయశాఖ సహకారంతో వారికి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి.సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, హసీ బుల్లా, పోలీసు కార్యాలయం ఏవో భక్తప్రహ్లాద్, సూపరింటెండెంట్లు సంజీవ్, గంగాధర్, ఇన్‌స్పెక్టర్లు డి.సాయినాథ్, కరుణాకర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, సైబర్‌క్రైమ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment