కై లాస్‌నగర్: జిల్లాలో విజయ డెయిరీ పాల అమ్మకాలను విస్తృతపరిచే దిశగా ప్రయోగాత్మకంగా విజయసఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. బ్యాంకర్ల వార్షిక క్రెడిట్ ప్లాన్ అమలుపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశం నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 500మంది మహిళా సభ్యులతో విజయ పాలు, పాల ఉత్పత్తుల వి క్రయాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తొలివిడతలో ఆసక్తి గల 100 మంది సభ్యులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా రూ.25వేల రు ణం అందించాలని ఆదేశించారు. మండల కేంద్రాల్లోనూ ఎస్‌హెచ్‌జీ మహిళా సభ్యులతో అ మ్మకాలు చేపట్టాలని డీఆర్డీవోను ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్ అభిఘ్నాన్ మాలవియా, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్‌కుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్‌ఎం బీ ప్రభుదాస్, నాబా ర్డ్ డీడీఎం అబ్దుల్ రవుఫ్, సంబంధిత అధికా రులు, బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment