ఉన్నవి తీసుకో.. మిగతావి కొనుక్కో! | - | Sakshi
Sakshi News home page

ఉన్నవి తీసుకో.. మిగతావి కొనుక్కో!

Published Fri, Dec 20 2024 1:54 AM | Last Updated on Fri, Dec 20 2024 2:34 PM

రిమ్స్‌ ఆస్పత్రి

రిమ్స్‌ ఆస్పత్రి

రిమ్స్‌ ఆస్పత్రిలో సగం సేవలు 

ఫార్మసీలో అరకొర మందులే! 

కొరత లేదన్న డైరెక్టర్‌ రాథోడ్‌ 

కొనుక్కోమంటున్న ఫార్మసిస్ట్‌లు 

బయటే కొంటున్న పేదరోగులు 

‘ప్రైవేట్‌’తో అధికారుల కుమ్మక్కు!

ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌ పేరుకే పెద్దాస్పత్రి. ఇక్కడ మందుల కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించిన రోగులు వారు రాసిచ్చి మందు ల కోసం ఫార్మసీకి వెళ్తే పూర్తిస్థాయిలో ఇవ్వడం లే దు. కనీసం ఎందుకు లేవో కూడా చెప్పకుండా కొందరు ఫార్మసిస్టులు విసుక్కుంటున్నారు. ‘ఉన్నవి తీ స్కో.. మిగతావి బయట కొనుక్కో’ అని సెలవిస్తున్నారు. మందులకు వచ్చిన చాలామందికి ఒకట్రెండు రకాలిచ్చి మిగతావి ‘ప్రైవేట్‌’లో కొనుక్కోవా లంటున్నారు. ఒక వ్యాధికి సంబంధించి కాంబినేష న్‌ మందులు రాసిస్తే ‘ఒకేదానికి రెండు, మూడు మందులు ఎందుకు.. బయట రూ.20 పెడితే షీటు వస్తుంది’ అని ఉచిత సలహాలిస్తున్నారు.

‘ప్రైవేట్‌’తో కుమ్మకై..

రిమ్స్‌ ఆస్పత్రిలో ప్రైవేట్‌ మందుల వ్యాపారం కొనసాగుతోంది. కొంతమంది ఫార్మసిస్టులు ప్రైవేట్‌ మె డికల్‌ వ్యాపారులతో కుమ్మకై ్క దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం రిమ్స్‌కు వచ్చే రోగులకు వైద్యులు మందులు రాసిస్తున్నారు. అవి అందుబాటులో లేవని, ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల నుంచి కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో రోగులు సర్కారు ఆస్పత్రికి వస్తున్నా మందులు మాత్రం ‘ప్రైవేట్‌’లోనే కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కాగా, రిమ్స్‌లో మందుల కొరత లేదని అధికారులు చెబుతున్నా ఫార్మసీలో మాత్రం రోగులకు పూర్తిస్థాయిలో ఇవ్వడంలేదు.

గత్యంతరం లేకే..

రిమ్స్‌ ఆస్పత్రికి నిత్యం ఓపీ పేషెంట్లు వందల సంఖ్యలో వస్తుంటారు. సీజనల్‌ వ్యాధుల కాలంలో 1,000–1,500 వరకు వస్తారు. వైద్యులు రోగులను పరీక్షించి ఐదారు రకాల మందులు రాసిస్తే అందులో రెండు రకాలు మాత్రమే ఇస్తూ.. మిగతావి బ యట కొనుక్కోవాలని ఫార్మసిస్ట్‌లు చెబుతున్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ షాపులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నా యి. రిమ్స్‌లోని ప్రైవేట్‌ మెడికల్‌ షాపు నిత్యం రో గులతో కిక్కిరిసిపోతోంది. ఇక్కడ భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. గత్యంతరం లేక ప్రైవేట్‌ మెడికల్‌ షాపులకు వెళ్లి మిగతా మందులు కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి జిల్లాకు రిమ్స్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిని మంజూరు చేస్తే ఆయన లక్ష్యం నెరవేరడంలేదు.

మరో రెండు ప్రైవేట్‌ షాపులు..

ఇప్పటికే రిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో ఓ ప్రైవేట్‌ మెడికల్‌ షాపు ఉండగా, తాజాగా అధికారులు మరో రెండు జీవన్‌ ధార మెడికల్‌ షాపులు ఏర్పాటు చేసేందు కు ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రిమ్స్‌లో మందుల కొరత లేకున్నా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో కొనసాగుతున్న ప్రైవేట్‌ మెడికల్‌ షాపునకు రూ.3వేల నుంచి రూ.4వేల నామమాత్రపు అద్దె తీసుకుంటున్నట్లు సమాచారం.

నా పేరు భూమన్న. మాది ఆదిలాబాద్‌రూరల్‌ మండలం యాపల్‌గూడ. నాకు గుండె సంబంధిత వ్యాధి ఉండగా రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యుడికి చూపించుకున్న. డాక్టర్‌ నాలుగు రకాల మందులు రాసిచ్చిండు. ఆస్పత్రి మెడికల్‌ షాపులో రెండు రకాలు మాత్రమే ఇచ్చిన్రు. మిగతావి బయటి షాపులో కొనుక్కోవాలని చెప్పిన్రు.

నా పేరు ప్రేమ్‌దాస్‌. మాది జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీ. నాకు కంటి సమస్య ఉండటంతో రిమ్స్‌ ఆస్పత్రికి వచ్చిన. డాక్టర్‌ మందులు రాసిచ్చినా ఇక్కడి షాపులో లేవంటున్నరు. నా కొడుకుకు జలుబు, కడుపు నొప్పి ఉండటంతో ఆస్పత్రిలో చూపించిన. రెండు రకాల మందులు రాసిచ్చిన్రు. ఇవి కూడా ఆస్పత్రి షాపులో పూర్తిగా లేవన్నరు. బయట తీసుకోవాలని చెప్పిన్రు.

మందుల కొరత లేదు

రిమ్స్‌లో మందుల కొరత లేదు. వైద్యులు రాసిచ్చిన మందులు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదనే విషయం నా దృష్టికి రాలేదు. ప్రైవేట్‌ మెడికల్‌ షాపులో మందులు కొనుగోలు చేయాలని ఫార్మసిస్టులు చెబితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. కొత్తగా రెండు జీవన్‌ధార మెడికల్‌ షాపులు ఏర్పాటు చేస్తున్నాం. రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. ఫార్మసీని తరచూ తనిఖీ చేస్తున్నాం.

– జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఫార్మసీలో అరకొర మందులే1
1/1

ఫార్మసీలో అరకొర మందులే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement