పర్యావరణాన్ని పరిరక్షించాలి
ఆదిలాబాద్‌టౌన్: పర్యావరణాన్ని పరిరక్షించాలని నేషనల్ గ్రీన్‌కోర్ రాష్ట్ర కోఆర్డినేటర్ విద్యాసాగర్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఇకోఫ్రెండ్లీ లిక్విడ్ డిష్‌బార్ తయారీపై అవగాహన కల్పించారు. టెక్నికల్ సిబ్బంది కార్తిక్ సబ్బులు తయారు చేసే విధానాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఇకోఫ్రెండ్లీ విధానంలో తయారు చేసిన సబ్బులను వాడాలని సూచించారు. ప్రతీ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. సబ్బులు, హ్యాండ్ వాష్ లిక్విడ్ తయారీ నేర్చుకుంటే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆర్థికంగా లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌రూరల్, అర్బన్ ఎంఈవోలు నర్సయ్య, సోమయ్య, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిరణ్‌కుమార్, బరంపూర్ హెచ్‌ఎం ప్రత్యూష, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment