చదువుపై దృష్టి సారించాలి
● క లెక్టర్ రాజర్షి షా
తాంసి: యువత చదువుపై దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. భీంపూర్ మండలం అర్లి(టి) గ్రామంలో కలెక్టర్, గ్రామస్తుల సహకారంతో గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను గ్రామస్తులు శాలువాతో స న్మానించారు. సాయంత్రం పాఠశాల నుంచి గ్రామాలకు వెళ్లేటపుడు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు కలెక్టర్‌కు తెలుపగా వెంటనే ఆయన ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బ స్సు వేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను పరి శీలించారు. నిపాని గ్రామంలోనూ సర్వేను పరిశీలించి స్వయంగా దరఖాస్తుదారుల వివరాలు నమోదు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, ఎంఈవో శ్యాంసుందర్, అర్లి(టి) గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నవీన్, యూత్ అధ్యక్షుడు నితిన్ తదితరులున్నారు.
దుప్పట్లు, స్వెట్టర్ల పంపిణీ
భీంపూర్ మండలంలోని గిరిజన గ్రామమైన ఇందూర్‌పల్లిలో చలితీవ్రత అధికంగా ఉండటంతో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ రాజర్షి షా గ్రామస్తులకు దుప్పట్లు, స్వెట్టర్లు పంపి ణీ చేశారు. అనంతరం వైద్యశిబిరాన్ని పరిశీలించా రు. గ్రామపటేల్ దాదారావు పలు సమస్యలు తెలు పగా పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇందూర్‌పల్లిని ఆదర్శ గ్రామంగా మార్చాలని గ్రామస్తులను కోరారు. జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, అడిషనల్ డీఎంహెచ్‌వో సాధన, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షుడు సమియొద్దీన్, తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుధాకర్, ఆర్‌ఐ రాందాస్, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కృష్ణ, డెంటల్ అసోసియేషన్ సభ్యులు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment