● నేర సమీక్షలో ఎస్పీ గౌస్ ఆలం
పెండింగ్ కేసులు
సత్వరమే పరిష్కరించాలి
ఆదిలాబాద్‌టౌన్: పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించా రు. గురువారం స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ని సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పెట్రోలింగ్, గస్తీ, బీ ట్ పద్ధతులు ఉపయోగిస్తూ, బ్లూకోల్ట్స్, డయ ల్ 100 సిబ్బందిని వినియోగిస్తూ ఆర్థిక నేరాల ను కట్టడి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, గంజాయి, పోక్సో, గ్రేవ్, నాన్‌గ్రేవ్, మహిళలపై జరిగే నేరాలపై సమీక్షించారు. కోర్టు డ్యూటీ అధికారులతో ప్రతీ శనివా రం సమావేశం నిర్వహించి కోర్టులో జరిగే వి చారణ పద్ధతి, కేసుల ప్రస్తుత స్థితిగతులను ప ర్యవేక్షించాలని సూచించారు. గ్రామాలవారీగా మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈనెలలో మూడు కేసుల్లో నేరస్తుల కు జీవితకాల శిక్ష పడేలా కీలక పాత్ర పోషించి న పీపీలు సంజయ్ వైరాగ్రే, మేకల మధుకర్, సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు లైజన్ అధికారి గంగాసింగ్, కోర్టు డ్యూటీ అధికారులు ఎంఏ జమీర్, రవీందర్‌ను శాలువాలతో సత్కరించి నగదు ప్రదానం చేశారు. అనంతరం ఫోన్లు పోగొట్టుకున్న 28 మంది బాధితులకు వాటిని అందజేశారు. డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్‌రెడ్డి, సీహెచ్ నాగేందర్, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, డీసీఆర్బీ, ఫింగర్‌ప్రింట్, ఐటీ సెల్, సైబర్ అధికారులు పాల్గొన్నారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో శుక్రవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ కల్ప న ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలు తెలుపవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 9959226002 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment