ఉపకరణాలతో గణిత బోధన
నిర్మల్‌రూరల్: విద్యార్థులకు చార్టులు, బోధనోపకరణాలతో విద్యాబోధన చేస్తున్నారు నర్సాపూర్(జి) ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వి.మనోహర్‌రెడ్డి. ప్రాథమికస్థాయి నుంచి ఉపకరణాలతో గణితం బోధించడంలో ఆయన దిట్ట. ఇందుకోసం ఆయన సొంతంగా ఉపకరణాలు తయారు చేసుకున్నారు. రాష్ట్రస్థాయి, సౌత్‌ఇండియా స్థాయి, జాతీయస్థాయిలోనూ తన ఉపకరణాలను ప్రదర్శించి ప్రశంసలను పొందారు. సులభంగా గణితం బోధించడానికి తయారు చేసిన స్టడీ మెటీరి యల్, ఎస్సీఈఆర్టీ ద్వారా రాష్ట్రస్థాయిలో గణి త ఉపాధ్యాయులకు ఇచ్చే వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు, కరదీపికల రూపకల్పనలో మనోహర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ప్ర భుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలను ప్రో త్సహించడానికి ట్రస్టు ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment