‘సున్నా’ లేకుండా గణితం లేదు. లెక్కలేని జీవితం లేనే లేదు. లెక్కించడం ప్రారంభమైప్పటి నుంచే మానవ నాగరికత మొదలైంది. అలా లెక్కించే దానికి అంకెలు అవసరం అయ్యాయి. అంకెలు సంఖ్యలుగా మారి మానవ జీవితాన్ని మార్చివేశాయి. నిత్యజీవితంలో గణితానికి చాలా అనుబంధం ఉంటుంది. అందుకే పోటీ పరీక్షల్లో అంక గణితానికి ప్రత్యేక స్థానం లభించింది. జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, ఎంఈసీ వంటి కోర్సులకు డిమాండ్ ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తుకు ఇదే తొలిమెట్టు. ఇందులో ప్రతిభ కనబరిచే వారు ఇంజినీర్లు, చార్టెడ్ అకౌంట్, తదితర రంగాల్లో స్థిరపడుతున్నారు.
బాల్యం నుంచే గణిత భావనలు..
పిల్లలు బాల్యం నుంచే గణిత భావనలు అలవర్చుకుంటారు. సందర్భానుసారంగా తార్కికంగా ఆలోచించడం, సవాళ్లను ఎదుర్కోవడం నేర్చుకుంటారు. గణితంలో వెనుకబడుతున్న విద్యార్థుల కోసం విద్యాశాఖతో పాటు గణిత ఫోరం అనేక చర్యలు చేపడుతోంది. అలాగే మ్యాథ్స్‌లో ప్రతిభ కలవారిని ప్రోత్సహించేందుకు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 12న జిల్లాస్థాయి పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. నేడు హైదరాబాద్‌లో ఈ పోటీలు
కొనసాగనున్నాయి.
తమిళనాడు రాష్ట్రం తంజావూరులోని కుంభకోణంలో కుప్పుస్వామి–కోమలతమ్మల్ దంపతులకు 1987 డిసెంబర్ 22న రామానుజన్ జన్మించారు. పేద కుటుంబంలో పుట్టినా విద్యార్థి దశ నుంచే గణితంలో ప్రావీణ్యం సాధించారు. 13ఏళ్ల వయస్సులోనే త్రికోణమితి, జామెట్రీలను సొంతగా నేర్చుకున్నారు. ఈయ న ప్రతిభకు తార్కానమే 1729(రెండు విధాలుగా, రెండు ఘనాల మొత్తం అతి చిన్న సంఖ్య). దీనినే రామానుజన్ సంఖ్యగా వ్యవహరిస్తారు. ఆధునిక గణితశాస్త్రానికి అనేక సేవలందించారు. 33 ఏళ్ల వయస్సులోనే ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి ఆయన జ్ఞాపకార్థం ఏటా డిసెంబర్ 22న జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
Comments
Please login to add a commentAdd a comment