సిరుల గని.. సింగరేణి | - | Sakshi
Sakshi News home page

సిరుల గని.. సింగరేణి

Published Sun, Dec 22 2024 12:31 AM | Last Updated on Sun, Dec 22 2024 12:31 AM

సిరుల

సిరుల గని.. సింగరేణి

● సంస్థ క్షేమం.. పెరిగిన సంక్షేమం ● భవిష్యత్‌ సవాళ్లమయం ● నూతన గనులతోనే మనుగడ ● ఇతర రంగాల్లో విస్తరణకు శ్రీకారం ● పొరుగు రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపన ● నవరత్నాలకు దీటుగా లాభాలు ● 23న ఆవిర్భావ దినోత్సవం

ప్రతిపాదిత నూతన గనులు

ప్రాజెక్టు పేరు సామర్థ్యం

(మి. టన్నుల్లో)

వీకే ఓసీపీ – 5.30

జీడీకే 10 ఓసీపీ – 6.0

జేకే ఓసీపీ(రోంపేడు) – 2.0

గోలేటి ఓసీపీ – 3.5

ఎంవీకే ఓసీపీ – 2.0

పీవీఎన్‌ఆర్‌(వెంకటాపూర్‌) – 2.5

కేటీకే ఓసీపీ 2(యూజీ సెక్షన్‌) – 0.60

దీనితో పాటు ఒడిశాలోని నైనీ బ్లాక్‌ 2025లో ప్రారంభమైతే ఏడాదికి 10 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి రానుంది.

సింగరేణి విస్తరణ : 6 జిల్లాలు(ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌

భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం)

భూగర్భ గనులు : 22

ఓపెన్‌కాస్టు గనులు : 18

ఉద్యోగుల సంఖ్య : 38,594

అధికారుల సంఖ్య : 2,255

కాంట్రాక్ట్‌ ఉద్యోగులు : 23,500

ఓసీపీల్లో యంత్రాలు: షవల్స్‌ : 66, డంపర్లు: 425, డోజర్లు: 109, డ్రిల్స్‌: 48,

ఇతర యంత్రాలు: 828

భూగర్భ గనుల్లో యంత్రాలు: మ్యాన్‌రైడింగ్‌ యంత్రాలు: 52, కోల్‌ కట్టింగ్‌ డ్రిల్స్‌ : 119, ఎస్‌డీఎల్స్‌:105, ఎల్‌హెచ్‌డీస్‌: 10, లాంగ్‌వాల్‌: 1, కంటిన్యూయస్‌ మైనర్స్‌: 5, బోల్టర్‌ మైనర్స్‌: 2

పెరుగుతున్న ఉత్పత్తి, తగ్గుతున్న ఉద్యోగులు

ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి ఉద్యోగులు

(మి.ట)

2013–14 50.47 61,778

2014–15 52.54 58,837

2015–16 60.38 58,491

2016–17 61.34 56,282

2017–18 62.01 54,043

2018–19 64.40 48,942

2019–20 64.02 46,021

2020–21 50.58 43,895

2021–22 65.02 43,672

2022–23 67.14 42,733

2023–24 70.02 41,837

2024–25

(నేటివరకు) 44.31 38,594

శ్రీరాంపూర్‌: తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ అయిన సింగరేణి దినదినాభివృద్ధి చెందుతోంది. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించి వేల కోట్ల రూపాయల లాభాలు గడిస్తోంది. నేడు దేశంలోని నవరత్న కంపెనీలకు దీటుగా నిలుస్తోంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 135 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నెల 23న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సింగరేణిపై ‘సాక్షి’ అందిస్తున్న కథనం.

పొయ్యి రాళ్లే పునాదిరాళ్లు..

నాడు కట్టెల పొయ్యికి వాడిన రాళ్లే సింగరేణికి పునాది రాళ్లయ్యాయి. 1870లో భద్రాచలం రా ములవారిని దర్శించుకోవడానికి బయలుదేరిన భక్తులు మార్గమధ్యలో వంటావార్పుకు ఆగారు. వంటకోసం పేర్చిన పొయ్యిరాళ్లు అంటుకుని బూడిదయ్యాయి. దీంతో ఇదేదో రాకాసి మాయ అని భయపడ్డ భక్తులు అక్కడి నుంచి పారిపోయారు. అప్పటి బ్రిటీష్‌ పాలకులు దీనిపై పరిశోధనలు చేసి ఇది బొగ్గు ఖనిజం అని గుర్తించారు. అలా నల్లబంగారం లోకానికి వెలుగు చూసింది.

ఖమ్మం నుంచి విస్తరణ మొదలై..

సింగరేణి సంస్థ బ్రిటీష్‌ ప్రభుత్వంలో పురుడు పోసుకుంది. మొట్టమొదట ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందులోని బొగ్గుట్టలో 1889లో బొగ్గు తవ్వకా లు ప్రారంభించారు. ఆ తర్వాత 1920, డిసెంబర్‌ 23న సింగరేణి కాలరీస్‌ కంపెనీగా ఏర్పడింది. 1927లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలో, 1961లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రామగుండం, 1991లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లిలో బొగ్గు గనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతంలోని సుమారు 450 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు నిక్షేపాలను భూగర్భశాఖ అధికారులు గుర్తించారు. 1889లో 59,671 టన్నుల బొగ్గు ఉత్పత్తితో కంపెనీ ప్రస్తానం మొదలైంది. జాతీయీకరణ తరువాత సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతంతో కంపెనీ కొనసాగుతూ వస్తోంది.

రికార్డు స్థాయిలో ఉత్పత్తి...

గడిచిన ఆర్థిక సంవత్సరం 2023–24లో కంపెనీ రికార్డు స్థాయిలో 70.2 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఏడాది 2024–25లో 72 మిలియన్‌ టన్నుల లక్ష్యంతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం భూగర్భ గనులన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి. టన్ను బొగ్గు ఉత్పత్తి చేస్తే రూ.10,394 ఖర్చు అవుతుండగా దీన్ని అమ్మితే రూ.4,854 వస్తుంది. ఈ లెక్కన టన్నుకు రూ. 5,540 నష్టాన్ని కంపెనీ చవిచూస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికీ భూగర్భ గనుల్లో రూ.1,176 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే ఓసీపీల్లో, ఎస్టీపీపీ నుంచి వచ్చే లాభాలతో ఈ నష్టాలను పూడ్చుకుంటూ కంపనీ ముందుకెళ్తోంది.

మూసివేత దశలో భూగర్భ గనులు

కంపెనీలో ఉన్న 22 భూగర్భ గనుల్లో నిల్వలు అడుగంటడంతో 15 మూసివేతకు దగ్గరపడ్డాయి. వీటి స్థానంలో పదేళ్లుగా ఒక్క కొత్త గని ఏర్పాటు కాలేదు. గతంలో ఖనిజాన్వేషణ చేసి సిద్ధంగా ఉన్న కొన్ని బొగ్గు గనులను తవ్వేందుకు కంపనీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ గనుల్లో తవ్వకాలు మొదలైతే సింగరేణికి మరింత ఉజ్వల భవిష్యత్‌ ఉండబోతోంది.

ఇతర రంగాల్లో విస్తరణ

మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1200 మెగావాట్ల ఽథర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల లాభాలు గడిస్తోంది. దీనికి అదనంగా మరో 800 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. కంపెనీ వ్యాప్తంగా 246 మెగావాట్ల సోలార్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ట్రేడ్‌ యూనియన్ల ఆవిర్భావం ఇలా..

కార్మికుల హక్కుల సాధనలో సింగరేణి ట్రేడ్‌ యూనియన్ల పాత్ర ఎంతో కీలకం. వారి నీడలో కార్మికులు అనేక హక్కులు, సదుపాయాలు కల్పించబడ్డాయి.

● 1945లో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ)

● 1965లో సింగరేణి కోల్‌మైన్స్‌ లేబర్‌ యూనియన్‌ (ఐఎన్టీయూసీ),

● 1977లో సింగరేణి మైనర్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (హెచ్‌ఎంఎస్‌)

● 1977 ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ కాలరీస్‌ మజ్ధూర్‌ సంఘం

● 1978లో గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ)

● 1981లో సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)

● 1996లో శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఏఐఎఫ్‌టీయూ)

● 1984లో తెలుగునాడు గ్రేడ్‌ యూనియన్‌ (టీఎన్టీయూసీ)

● 1988లో పలు వృత్తి సంఘాలతో కలిపి సాజక్‌

● 2003లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌)

● 1998 నుంచి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభం

సంక్షేమానికి పెద్దపీట

● కార్మికులకు క్వార్టర్లు, ఉచిత విద్యుత్‌, ఏసీ సౌకర్యం

● ఆస్పత్రులు, క్యాంటీన్లు, స్కూల్స్‌, కాలేజీలు, క్రీడామైదానాలు, రిక్రియేషన్‌ క్లబ్‌లు, పార్కులు

● ఉద్యోగులతో పాటు తల్లిదండ్రులకు సైతం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం

● రిటైర్డ్‌ కార్మికులకు సీపీఆర్‌ఎంఎస్‌ స్కీం కింద వైద్యఖర్చులు రూ.8 లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంపు

● గని ప్రమాదంలో కార్మికులు చనిపోతే రూ.కోటి ప్రమాదబీమా

● కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.30 లక్షల ప్రమాదబీమా

● రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలలో కార్మికుల పిల్లలకు 7 సీట్లు, మంథని జేఎన్‌టీయూలో 35 సీట్లు కేటాయింపు

● లాభాల్లో వాటా 33 శాతం కార్మికులకు చెల్లింపు

చాలా మార్పులు వచ్చాయి

36 ఏళ్లుగా సింగరేణిలో పని చేస్తున్నా. నాడు తట్టా చెమ్మస్‌తో పని చేశాం. ఇప్పుడన్నీ యంత్రాలతోనే చేస్తున్నాం. మొదట్లో చాలా ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు సేఫ్టీ పెరిగి ప్రమాదాలు తగ్గాయి. కారుణ్య ఉద్యోగాలతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి.

– మెండె వెంకటి, సపోర్టుమెన్‌, ఆర్కే7

లక్ష్యాలను సాధిస్తే అద్భుత ఫలితాలు

నిర్ధేశించిన లక్ష్యాలను సాధిస్తేనే అద్భుత ఫలితాలు పొందుతాం. అప్పుడే సంస్థ మనుగడ సాధిస్తుంది. లాభాలు వస్తే ఉద్యోగుల సంక్షేమానికి మరింత ఖర్చు చేయొచ్చు. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో రక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చే చర్యలు చేపట్టాం. సింగరేణీయన్లకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. – ఎల్వీ సూర్యనారాయణ,

జీఎం, శ్రీరాంపూర్‌

గర్వంగా ఉంది

కారుణ్య నియామకం కింద డిపెండెంట్‌గా నాకు ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్లుగా సంస్థలో పనిచేస్తున్నా. మా నాన్న పని చేసిన సంస్థలోనే నేను కూడా రెండో తరంగా పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. సింగరేణిలో ఉద్యోగం చేయడం గర్వంగా ఉంది.

– రమణ, ఉద్యోగి, ఆర్కే 8 డిస్పెన్సరీ

No comments yet. Be the first to comment!
Add a comment
సిరుల గని.. సింగరేణి1
1/6

సిరుల గని.. సింగరేణి

సిరుల గని.. సింగరేణి2
2/6

సిరుల గని.. సింగరేణి

సిరుల గని.. సింగరేణి3
3/6

సిరుల గని.. సింగరేణి

సిరుల గని.. సింగరేణి4
4/6

సిరుల గని.. సింగరేణి

సిరుల గని.. సింగరేణి5
5/6

సిరుల గని.. సింగరేణి

సిరుల గని.. సింగరేణి6
6/6

సిరుల గని.. సింగరేణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement