ఇందారం రోడ్డు ప్రమాదంపై సీఐ విచారణ
జైపూర్: ఇందారం బస్టాండ్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన సుంకరి మల్లయ్య మృతి చెందాడు. ఘటనపై శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ ఆదివారం విచారణ చేపట్టారు. ఇందారం వద్ద సెంట్రల్ లైటింగ్ ఉండి కూడా పవర్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో రాత్రి సమయంలో ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. పశువులు రోడ్లపై సంచరిస్తుండడంతో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. బస్టాండ్ వద్ద లైటింగ్‌తో పాటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు హెచ్‌కేఆర్ మేనేజర్ రామకృష్ణను పిలిపించి మాట్లాడారు. హెచ్‌కేఆర్ కంపెనీ నిర్లక్ష్యం మూలంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా సెంట్రల్ లైటింగ్‌కు విద్యుత్ కనెనక్షన్ ఇవ్వాలని, లేనిపక్షంలో కంపెనీపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment