బాధితులకు పరామర్శ
మందమర్రిరూరల్: పట్టణంలోని విద్యానగర్ చెంచుకాలనీ సమీపంలో ఈ నెల 19న పోలీసులు వేధిస్తున్నారని నలుగురు యువకులు హెయిర్‌డై తాగి ఆత్మహత్యకు యత్నించిన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. సమయానికి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించడంతో ఆరోగ్యం ఇంటికి తిరిగివెళ్లారు. విషయం తెలుసుకున్న మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం బాధితుల ఇళ్లకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత నెల కేకే–1 గనిపై జరిగిన చోరీ కేసులో సెక్యూరిటీ సీనియర్ ఇన్‌స్పెక్టర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తొమ్మిది మంది పేరిట కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్‌కు తరలించారన్నారు. సదరు యువకులను పోలీసులు వేధించడం వల్లే మనస్తాపానికి గురయ్యారని ఆరోపించారు. ఇప్పటికై నా వారిపై వేధింపులు ఆపాలని, వారానికి రెండు రోజులు పోలీస్ స్టేషన్‌కు రావాలనే కండీషన్ రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘోత్తమరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు పందిళ్ల రంజిత్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment