ఐటీడీఏ పీవో సుడిగాలి పర్యటన
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఐటీడీఏ పీవో
ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం గాదిగూడ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఝరి ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల హాజరు, వంటగది పరిశీలించి సక్రమంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ రాంకిషన్‌ను బదిలీ చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. నాణ్యమైన సరుకులు సరఫరా చేయడంలేదని జీసీసీ మేనేజర్ చందూలాల్‌పై బదిలీ వేటు వేశారు. గాదిగూడ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఏఎన్‌ఎంను విధుల్లోంచి తొలగించారు. రికార్డులు సరిగా లేకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు రామారావుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చిత్తగూడలో రిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆమె వెంట జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment