‘ఇందిరమ్మ’ సర్వే పకడ్బందీగా చేపట్టాలి
● జనవరి 2లోపు పూర్తి చేయాలి ● కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జైనథ్ మండలంలోని నిరా ల, సావపూర్ గ్రామాల్లో చేపడుతున్న సర్వేను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో లక్ష 97వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు 40 శాతం సర్వే పూర్తయిందని, మిగతాది జనవరి 2లోగా పూర్తి చేయాలన్నారు. యాప్‌లో సమస్యల పరిష్కారానికి స్టేట్ టెక్నికల్ అధికారి రత్నాకర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారం చూపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్యామ్ సుందర్, ఎంపీడీవో, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులున్నారు.
డోర్లి గ్రామంలో..
తలమడుగు: మండలంలోని డోర్లి గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ రాజర్షిషా తనిఖీ చేశారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలు సుకున్నారు. సర్వే త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. భూదాన్ భూములకు పట్టా పాస్ బుక్కులు అందించాలని ఆదివాసీ గిరిజన రైతులు కోరగా.. కలెక్టర్ స్పందించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇందులో తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీవో వినోద్, పంచాయతీ కార్యదర్శి గజానంద్ తదితరులున్నారు. కాగా, కలెక్టర్ పర్యటన సమాచారం తమకు అందించలేదని కలెక్టర్‌కు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.
డీఆర్డీవోగా రవీందర్ రాథోడ్
● నిజామాబాద్ జెడ్పీ డిప్యూటీ సీఈవోగా సాయన్న బదిలీ
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారిగా రాథోడ్ రవీందర్ నియామకమయ్యారు. ప్రస్తుత డీఆర్డీవో సాయన్నను నిజామాబాద్ జిల్లా డిప్యూటీ సీఈవోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్ జెడ్పీ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తూ, కొంత కాలంగా సెలవుపై వెళ్లిన కలిందినిని పెద్దపల్లి డీఆర్డీవోగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఇంకా ఎవరికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యుడైన రాథోడ్ రవీందర్ ఇది వరకు జిల్లాలోనే ఏడీఆర్డీవోగా పనిచేస్తూ పార్లమెంట్ ఎన్నికల నేఫథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న పెద్దపల్లి ఏడీఆర్డీవోగా బదిలీపై వెళ్లారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జిల్లాకు డీఆర్డీవోగా ఆయన తిరిగి వస్తారనే ప్రచారం ఆ శాఖతో పాటు అధికారవర్గాల్లో జోరుగా సాగింది. దాన్ని నిజం చేస్తూ తిరిగి జిల్లాకు రానున్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
రోడ్లు ఊడ్చి ‘సమగ్ర’ ఉద్యోగుల నిరసన
ఆదిలాబాద్‌టౌన్/ కైలాస్‌నగర్: సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలో భా గంగా పట్టణంలోని తె లంగాణ చౌక్‌లో మంగళవారం స్వచ్ఛభారత్ నిర్వహించారు. రోడ్లను ఊడ్చి నిరసన తెలిపా రు. అనంతరం డీఈవో ప్రణీతను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10 నుంచి సమ్మెలో ఉన్నామని, పరిష్కరించకపోతే పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళ్తామని పేర్కొన్నారు. ఇందులో కవిత, ప్రియాంక, మల్లిక, దీప్తి, సువర్ణ, హిమబిందు, నవీన, సంధ్య తదితరులున్నారు.
జిల్లా కేంద్రానికి శ్రీరాముని పాదుకలు
ఆదిలాబాద్: లోకకల్యాణార్థం హైదరాబాద్ నుంచి అయోధ్య కు తీసుకు వెళుతున్న శ్రీరాము ని స్వర్ణపాదుకుల పల్లకి పాదయా త్ర మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర హైదరాబాద్‌లో ఈనెల 17న ప్రారంభమైంది. ఈ పాదుకలను అదనపు ఎస్పీ సురేందర్ రావు దర్శించుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, హిందూ సమాజ ఉత్సవ సమితి అధ్యక్షుడు హన్మాండ్లు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment