మద్యానికి బానిసై ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై దుబ్బాక సునీల్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని అంజీ గ్రామానికి చెందిన గోద్మలే రాహుల్ (22) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. తరచూ ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. సోమవారం మద్యం సేవించి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం పంటచేలకు వెళ్లి గుర్తు తెలియని పురుగుల మందుతాగి ఇంటికొచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించినా పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజమున మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రాహుల్ (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment