భైంసారూరల్: మండలంలోని బడ్‌గాం గ్రామానికి చెందిన బోస్లే పులాజీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మాలిక్ కథనం ప్రకారం.. బోస్లే పులాజీ (51) గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అప్పటినుంచి మానసికంగా బాధపడుతూ జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉరేసుకున్నాడు. కుటుంబీకులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఏరి యా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment