భాగవత పారాయణం ప్రారంభం
అదిలాబాద్: జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శుక్రవారం శ్రీదేవి భాగవత పారాయణం ఘనంగా ప్రారంభమైంది. భాగవత గ్రంథాన్ని పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన శిరస్సుపై ఉంచుకొని శోభాయాత్రగా మఠానికి తీసుకువచ్చారు. భాగవత విశిష్టతను ప్రవచకులు ఫణతుల మేఘరాజ్ శర్మ భక్తులకు వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామ న్న, వైశ్య రక్షక్ సభ్యులు, సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, బీజేపీ నాయకులు లాలామున్నా, జోగు రవి, ప్రవీణ్, ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment