జిల్లాకు చేరిన ఓటర్ల తుది జాబితా
కైలాస్‌నగర్: ఓటరు జాబితా సంక్షిప్తసవరణ– 2025 లో భాగంగా రూపొందించిన జిల్లా ఓటర్ల తుది జా బితాను ఈసీ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ ఈనెల 6న ప్రకటించనున్నా రు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటరు జాబితాలు జిల్లా కేంద్రానికి చేరాయి. వాటిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో భద్రపర్చిన అధికారులు గ్రామాల వా రీగా సిద్ధం చేసిన జాబితాలను శనివారం రెవెన్యూ ఉద్యోగులకు అందజేశారు. వీటిని ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయాలతో పాటు జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 6న ప్రదర్శించనున్నారు. బీఎల్‌వోల వద్ద కూడా అందుబాటులో ఉంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment