25వ రోజుకు ‘సమగ్ర’ నిరసన●
● ‘కంది’ కార్యాలయం ముట్టడించిన ఉద్యోగులు
కై లాస్‌నగర్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 25వ రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు శనివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టరేట్ ఎదుట గల సమ్మె శిబిరం నుంచి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. కంది అందుబాటులో లేకపోవడంతో వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ ఫోన్ ద్వారా ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడించారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో పడాల రవీందర్, ప్రియాంక, ధరంసింగ్, కేశవ్, శ్రీకాంత్, అర్చన, వెంకటి, భోజన్న, రాజన్న, మమత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment