‘కవ్యాల్’లోకి రాత్రిపూట నో ఎంట్రీ..
ఉట్నూర్‌రూరల్: గతంలో ఎన్నడూ లేని విధంగా రాత్రి తొమ్మిది గంటల తరువాత కవ్వాల్ అభయారణ్యం గుండా చిన్న వాహనాలు వెళ్లకూడదని అట వీ అధికారులు కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. దీంతో శనివారం రాత్రి ఉట్నూర్ మండలం కొత్తగూడ చెక్‌పోస్ట్ వద్ద భారీగా కార్లు, ఇతరచిన్న వాహ నాలను అక్కడ సిబ్బంది నిలిపివేశారు. ఎముకలు కొరికే చలిలో వాహనదారులు, ప్రయాణికులు ఇ బ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హుటాహుటిన అర్ధరాత్రి 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. వాహనదారులు, ప్రయాణికులతో మాట్లాడారు. చలిలో వారు ఇక్కట్లను గుర్తించి చెక్‌పోస్ట్ సిబ్బందిని నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము వాహనా లు నిలిపివేశామని చెప్పడంతో ఎమ్మెల్యే వెంటనే నిర్మల్ ఎఫ్‌డీపీటీతో ఫోన్‌లో మాట్లాడారు. కొత్త నిబంధనలు ఎందుకు పెట్టారనిప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేనే కాకుండా వైల్డ్‌లైఫ్ బోర్డుమెంబర్ అనే విషయం గుర్తు చేశారు. తనకు తెలియకుండా కొత్త నిబంధనలు ఎలా అమలుపరుస్తారని ప్రశ్నించారు. వెంటనే వాహనాలను విడిచి పెట్టాలన్నారు. ఆది లాబాద్ డీఎఫ్‌వోతో కూడా ఫోన్లో మాట్లాడారు. ప్రజలను ఇబ్బందికి గురిచేసే చర్యలు మానుకోవా లని సూచించారు. చిన్న వాహనాల అనుమతి విషయంలో తాను అటవీశాఖ మంత్రి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వెటర్‌తో ఉదయం మాట్లాడుతానన్నారు. అలా గే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఉన్న తస్థాయి నిర్ణయం జరిగే వరకు చిన్న వాహనాలను ఆపకూడదని సూచించారు. అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురావడంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు బీర్సాయిపేట రేంజ్ అధికారి అరుణ, చెక్‌పోస్టు సిబ్బంది వాహనాలను అనుమతించారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తొమ్మిది దాటితే ఆగాల్సిందేనట!
కొత్తగూడ చెక్‌పోస్టు వద్ద వాహనాలను అడ్డుకున్న సిబ్బంది
ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ప్రయాణికులు
అర్ధరాత్రి చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బొజ్జు
అధికారులతో చర్చించి అనుమతించేలా చర్యలు
Comments
Please login to add a commentAdd a comment