రోడ్డు ప్రమాదాల నియంత్రణ అందరి బాధ్యత
● కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్‌టౌన్: రోడ్డు ప్రమాదాల నియంత్రణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఆటో ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద ర్యాలీని కలెక్టర్ ప్రారంభించగా.. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జనవరి 1నుంచి 30వరకు సడక్ సురక్ష అభియాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చిన్న చిన్న అంశాలను గుర్తించినప్పుడే ప్రమాదాలను నివారించుకోగలమన్నారు. పట్టణంలోని బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి అక్కడ రంబల్ స్టేట్స్, స్పీడ్ బ్రేకర్స్ వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ట్రాఫిక్, రహదారి నిబంధనలపై ప్రతీ పాఠశాలలో పోటీలతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పి.రవీందర్ కుమార్, ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమన్, డీఎం కల్పన, ఎంవీఐ శ్రీనివాన్, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఏఎంవీఐలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment