డ్రైవర్లకు కంటి చూపు కీలకం
ఆదిలాబాద్‌టౌన్: వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి కంటి చూపు ఎంతో అవసరమని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వి.రవీందర్ కుమార్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా దుర్గం ట్రస్టు ఆధ్వర్యంలో స్కూల్ బస్సు డ్రైవర్లకు శనివారం నేత్రవైద్య శిబిరం నిర్వహించారు. ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే డ్రైవర్లకు కంటి చూపు ఎంతో అవసరమన్నారు. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఇందులో ఆర్టీసీ ఆర్‌ఎం సోలోమన్, ఎంవీఐ శ్రీనివాన్, ఏఎంవీఐలు హరిందర్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.
వాహనదారులకు పూలు, చాక్లెట్లు అందించి..
ఇదిలా ఉంటే పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. కలెక్టరేట్ చౌరస్తాలో వాహనదారులకు పూలు, చాకెట్లు అందిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. ట్రాఫిక్ సీఐ ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment