శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన కర్తవ్యం
● ఎస్పీ గౌస్ ఆలం ● సిరిచెల్మలో పోలీసుల ఆధ్వర్యంలో వైద్యశిబిరం
ఇచ్చోడ: శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రఽ దాన కర్తవ్యమని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. మండలంలోని సిరిచెల్మలో పోలీసుల ఆధ్వర్యంలో శని వారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి ఆయన ము ఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మారుమూల గ్రా మాల్లో ఉంటున్న ఆదివాసీ, గిరిజనుల కష్టసుఖాల్లో పోలీసులు పాలు పంచుకుంటున్నారని తెలిపారు. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ మాట్లాడుతూ, గిరి జన ప్రాంతాల్లో పోలీసుశాఖ ద్వారా సేవ చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అలాగే హైదరాబాద్ రోట రీ క్లబ్ ఆధ్వర్యంలో రెండు వేల మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. పలువురు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో డీఎస్పీ నాగేందర్, సీఐ భీమేశ్, ఎస్సైలు తిరుపతి, శ్రీకాంత్, మహేందర్, రోటరీ క్లబ్ అధ్యక్షులు చిత్ర, పోలీసులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment