నేడు జిల్లాకు మంత్రి సీతక్క రాక
కైలాస్‌నగర్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఽసీతక్క ఈ నెల 6న జిల్లాలో పర్యటించనున్నారు. రూ.14.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, అలాగే రూ.2.75 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనకు సంబంధించిన అధికారికషెడ్యూల్ ఖరారైంది. 5న సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11గంటలకు జిల్లా కేంద్రంలోని పెన్‌గంగ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
6న ఉదయం 10.05 గంటలకు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దస్నాపూర్‌కు చేరుకుని ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.10.50కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు, అలాగే చిల్కూరి లక్ష్మీనగర్‌లో రూ.1.43 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పీహెచ్‌సీ భవనానికి బీసీ స్టడీ సర్కిల్ వద్ద శిలాఫలకం ఆవిష్కరించనున్నారు.
జిల్లాలోని 20 గ్రామీణ మండలాల్లో రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న ఇందిరమ్మ మోడల్‌ఇళ్ల నిర్మాణానికి మావ ల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉదయం 10.40గంటలకు భూమి పూజ చేస్తారు. ఇదే మండలం దుబ్బగూడలో రూ.1.43కోట్ల వ్యయంతో ని ర్మించనున్న పీహెచ్‌సీ నూతన భవన నిర్మాణానికి ఉదయం 11.05 గంటలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రిమ్స్‌కు చేరుకుని ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను ప్రారంభిస్తారు.
జాతీయ రహదారి భద్రత మాసోత్సవం పురస్కరించుకుని చేపట్టే బైక్ ర్యాలీని బాబు జగ్జీవన్‌రాం చౌక్‌లో మధ్యాహ్నం 12గంటలకు జెండాఊపి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.05 గంటలకు రూ.2కోట్ల వ్య యంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సమీపంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. 12.20 గంటలకు టీటీడీసీకి చేరుకుని రూ.75లక్షల వ్యయంతో నిర్మించిన జిల్లా సమాఖ్య నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.
అక్కడి నుంచి తిరిగి పెన్‌గంగ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం 1.30గంటలకు మావలలోని పద్మనాయక గార్డెన్‌లో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం నిర్మల్ జిల్లాకు బయలుదేరి వెళుతారు. పర్యటన విజయవంతానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment