మళ్లీ చలి పంజా
● జిల్లాలో పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ● భీంపూర్‌లో 6.2 డిగ్రీలుగా నమోదు
ఆదిలాబాద్‌టౌన్/బోథ్: జిల్లాలో మళ్లీ చలిపులి పంజా విసురుతోంది. రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం జిల్లాలో భీంపూర్ మండలంలో 6.2 డిగ్రీలుగా నమోదైంది. బేలలో 6.9, జైనథ్, మావలలో 7.5, బోథ్‌లో 8.1, తాంసిలో 8.7, ఆదిలాబాద్ రూరల్‌లో 8.8 ,నేరడిగొండలో 9డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం క్రితం వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు 15నుంచి 18 డిగ్రీలుగా ఉండగా రెండు మూడు రోజులుగా వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో క్రమంగా పడిపోయాయి. వేకువజామున, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ఉదయం వివిధ పనులకు వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment