పోలీస్ కార్యాలయంలో ‘నూతన’ వేడుకలు
ఆదిలాబాద్‌టౌన్: నూతన సంవత్సర వేడుకలను స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది వచ్చి ఎస్పీకి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కలిసి ఎస్పీ కేక్ కట్ చేశారు. పోలీసులతో పాటు జిల్లావాసులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్. జీవన్‌రెడ్డి, సీహెచ్ నాగేందర్, హసీబుల్లా, పోలీసు కార్యాలయం ఏవో భక్త ప్రహ్లాద, సీఐలు, ఎస్సైలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment