ఆపద్బాంధవుడిగా ఇంటర్ సెప్టర్ సేవలు
● ఎస్పీ గౌ్‌స్ ఆలం
ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్ సెప్టర్ వాహనం అత్యవసర సమయాల్లో బాధితులకు ఆపద్బాంధవుడిగా సేవలందిస్తుందని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. ఒక ఏఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో అందుబాటులోకి తెచ్చిన ఈ వాహనాన్ని శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో స్పందించేందుకు, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసి, ప్రమాదాలు, నేరాలను నియంత్రించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. ఇందులో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు సునీల్, కరుణాకర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, వాహన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment