సావిత్రిబాయి పూలే ఆదర్శప్రాయులు
కై లాస్‌నగర్: చదువుతోనే సమాజంలో జరిగే ప్రతీ విషయాన్ని గ్రహించగలుగుతారనే ఉద్దేశంతో మొట్టమొదటి మహిళా పాఠశాలను నెలకొల్పిన సావిత్రిబాయి పూలే మహిళాలోకానికి ఆదర్శప్రాయులని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వర్గీకరణ అధ్యయన ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కలిసి కలెక్టర్ రాజర్షి షా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలను అరికడుతూనే, మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తలని కొనియాడారు. మహిళలకు విద్య ఆవశ్యకతను గుర్తించి 1948లోనే పాఠశాలను స్థాపించి తొలి ఉపాధ్యాయురాలుగా కీర్తి గడించిన సావిత్రి బాయి పూలే స్ఫూర్తిగా మహిళలు ముందుకు సాగా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డీఎస్సీడీవో సునీతకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మనోహర్, వివిధ దళితసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కజ్జర్లలో..
తలమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సావిర తిబాయి పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో ప్రణీత ముఖ్య అతిథిగా పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఇందులో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ రాజర్షి షా
Comments
Please login to add a commentAdd a comment