జిల్లా జడ్జికి పూల మొక్క అందజేస్తున్న ఎస్పీ గౌస్ ఆలం
● జిల్లా జడ్జి ప్రభాకరరావు
ఆదిలాబాద్‌టౌన్: నూతన సంవత్సరంలో మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు అన్నారు. ఎస్పీ గౌస్ ఆలం, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌లు జిల్లా జడ్జిని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, ఈ ఏడాదిలో మరింత ఉత్సాహంతో జిల్లా ప్రజలకు సేవలందించాలన్నారు. అనంతరం పలు పెండింగ్ కేసులపై చర్చించారు. వారి వెంట ఆదిలా బాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment