‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ రాజర్షి షా ● ప్రధానోపాధ్యాయులతో గూగుల్‌మీట్
కై లాస్‌నగర్: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ‘పది’ పరీక్షల సన్నద్ధతపై కేజీబీవీలు, ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, మండల ప్రత్యే క అధికారులకు శుక్రవారం గూగుల్ మీట్ ద్వారా దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతుల నిర్వహణ, అభ్యాస దీపికలు ఫాలో అవుతున్నారా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో చాలా మంది విద్యార్థుల్లో ఆందోళన, ఒత్తిడి కలిగే అవకాశముంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో వారికి మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉంటుందన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు వచ్చే ఈ రెండు నెలల పాటు విద్యార్థులకు అందుబాటులో ఉండి వారు మంచి మార్కులు సాధించేలా దృష్టి సారించాలన్నారు. అలాగే ఇంటర్మీడియెట్‌లోనూ వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇందులో బీసీ సంక్షేమాధికారి రాజలింగు, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment