ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలో నెలకొన్న ట్రాఫిక్ స మస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మునిసిపల్, పోలీస్ అధికారులు, కౌన్సిలర్లతో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని అంబేడ్కర్ చౌక్, గాంధీచౌక్, వినాయక్ చౌక్‌లతో పాటు ప్రధాన రోడ్డు వెంబడి ఉన్న చిరువ్యాపారుల దుకాణాలను తొలగించి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. శివాజీ చౌక్‌లోని కూరగాయల మార్కెట్, గణేశ్ థియేటర్ స్థలంలో చిరువ్యాపారులకు స్థలాలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఆదివారం అంబేడ్కర్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు జరిగే వారసంత కారణంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉన్నందున ఆ రోజు ఆటోలు, ఇతర వాహనాలకు అనుమతి నిరాకరించనున్నట్లు పేర్కొన్నారు. మునిసిపల్ కమిషనర్ రాజు, టీపీవో సుమలత, డీఈ తిరుపతి, మెప్మా డీఎంసీ శ్రీనివాస్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment