సీఎంను కలిసిన ఎమ్మెల్యే బొజ్జు..
ఉట్నూర్‌రూరల్: సీఎం రేవంత్‌రెడ్డిని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. జంగుబాయి ఉత్సవాలకు నిధులు కేటాయించాలని కోరారు. అలాగే కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలో అటవీ అధికారులు చెక్‌పోస్టుల వద్ద రాత్రి 9గంటల నుంచి చిన్న వాహనాలను నిలిపి వేస్తుండంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం రాత్రి వేళలో వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్‌లో సమసిపోని ‘ప్లార్లమెంట్’ ఓటమి ఇప్పటి వరకు నాలుగు గోడల మధ్యే వ్యవహారం తాజాగా పార్టీ ‘సమీక్ష’లో ఓపెన్ ఒకరిపై మరొకరు మాటల తూటాలు కార్యకర్తల్లో అయోమయం
కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు యథాతథం అన్నట్లుగా మారింది. పార్టీలో పార్లమెంట్ ఎన్నికల ఓటమితో మొదలైన మంట లు ఇంకా చల్లారినట్లు కనిపించట్లేదు. ఇప్పటి వరకు నాలుగు గోడలకే పరి మితమైన వ్యవహారం తాజాగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి సమీక్షలో బహిర్గతమైంది. ముఖ్య నేతలు తమ ప్రసంగాల్లో ఒకరిపై మరొకరు కౌంటర్ ఇచ్చేలా మాటల తూటాలు పేల్చడం గమనార్హం. దీంతో సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు విస్తుపోవాల్సిన పరిస్థితి.
– సాక్షి, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment