No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, May 6 2024 8:50 AM

-

చోడవరం: నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల్లో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి పనులు అనేకం చేపట్టారు. రూ.1,800 కోట్లతో సంక్షేమ, అభివృద్ధి పనులు జరిగాయి. ఇంత భారీ మొత్తంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ కాలేదు. రూ. 850 కోట్ల అభివృద్ధి పనులు చేయగా, మరో రూ. 850 కోట్లు వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసింది. కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ పథకాలు పొందడం కోసం సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ పాలనను గ్రామస్థాయికి తెచ్చింది. నియోజకవర్గంలో 1,445 మంది వలంటీర్లను నియమించి నేరుగా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల ఇంటికే చేరుస్తోంది. రైతు భరోసా కేంద్రాలు నిర్మించి విత్తనాలు, ఎరువులు, కిమిసంహారక మందులు గ్రామాల్లోనే అందిస్తున్నారు. పంట సీజన్లలో నేరుగా రైతుల వద్దకే శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు వచ్చి వ్యవసాయ సూచనలు ఇస్తున్నారు. విద్యుత్‌ లైన్‌ వేయలేని 42 మైదాన గిరిజన గ్రామాలకు సోలార్‌ సిస్టమ్స్‌ సాయంతో మంచినీటి సౌకర్యం కల్పించిన ఏకై క ప్రభుత్వం. 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ప్రధాన రహదారులన్నీ కోట్లాది రూపాయలతో కొత్త రోడ్లను వేసి ప్రజల కష్టాలను తీర్చారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలకు ధీమా కలిగించడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement