కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

Published Mon, May 6 2024 9:25 AM

కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

● 1228 మంది ప్రభుత్వ ఉద్యోగులు

వినియోగం

68 మంది హోం ఓటింగ్‌

కలెక్టర్‌ విజయ సునీత

సాక్షి,పాడేరు: జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఆదివారం 1222 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌తో ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్‌ ఎం.విజయసునీత ఓ ప్రకటనలో తెలిపారు. వృద్ధులు,దివ్యాంగులు 68 మంది హోం ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకున్నారన్నారు. అరకులోయ నియోజకవర్గంలో 288 పోస్టల్‌ బ్యాలెట్‌, 24మంది హోం ఓటింగ్‌, పాడేరు నియోజకవర్గంలో 387 మంది పోస్టల్‌ బ్యాలెట్‌, 37 మంది హోం ఓటింగ్‌, రంపచోడవరం నియోజకవర్గంలో 547మంది పోస్టల్‌ బ్యాలెట్‌, ఏడుగురు హోం ఓటింగ్‌లో పాల్గొన్నారని ఆమె తెలిపారు. ఈ ప్రక్రియను మూడు నియోజకవర్గాల ఆర్వోలు భావన వశిష్ట, వి.అభిషేక్‌, ప్రశాంత్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు,

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ పరిశీలన

రంపచోడవరం: స్థానిక గిరిజన సంక్షేమ బాలికల జూనియర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను ఆదివారం ఆర్వో ప్రశాంత్‌కుమార్‌తో కలిసి సాధారణ ఎన్నికల పరిశీలకుడు కె. వివేక్‌ నందన్‌ పరిశీలించారు. అనంతరం గురుకుల బాలికల కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. డిగ్రీ కళాశాల వద్ద హెలీప్యాడ్‌ను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అధికారులు, సిబ్బంది తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే లక్ష్యంతో చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

పింఛన్ల పంపిణీలోరాష్ట్రంలో ప్రథమస్థానం

కలెక్టర్‌ విజయ సునీత

సాక్షి,పాడేరు: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు. జిల్లా లో మొత్తం1,27,435 మంది పింఛనుదారు ల్లో 99.73 శాతం మందికి పంపిణీ చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన డీఆర్‌డీఏ పీడీ మురళి, ఎల్‌డీఎం రవితేజ, బ్యాంకర్లు, ఎంపీడీవోలు, గ్రామసచివాలయాల ఉద్యోగులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement