పాల
సముద్రం
వంజంగి హిల్స్‌లో ఆహ్లాదకర వాతావరణంలో శుక్రవారం సూర్యోదయం అందాలను పర్యాటకులు ఆస్వాదించారు. మేఘాలు నేలజారాయా అన్నట్టుగా కొండల మధ్య పాలసముద్రాన్ని తలపించాయి. మంచు తెరల్లో ఉదయ భానుడి అందాలు ఆకట్టుకున్నాయి. – సాక్షి, పాడేరు
హిమ సొగసు
మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు తెరలు కమ్ముకుంటున్నాయి. ఈ అందాలను పర్యాటకులు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు.
– ముంచంగిపుట్టు
ముత్యాల గూడు
ముంచంగిపుట్టులో మంచు
బిందువులతో నిండి ఉన్న
ఓ సాలెగూడు ప్రకృతి
ప్రేమికులను ఎంతగానో
ఆకట్టుకుంది. వలను
తలపించేలా ఉన్న ఈ అందాన్ని ఆసక్తిగా తిలకించారు.
– ముంచంగిపుట్టు
Comments
Please login to add a commentAdd a comment