పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
చింతూరు: పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని చట్టిలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జంక్షన్‌లో దుకాణాల వద్ద చెత్తను పారిశుధ్య, వివిధ శాఖల సిబ్బందితో కలసి ఆయన శుభ్రం చేశారు. దుకాణాల ఎదుట చెత్త లేకుండా చూడాలని, పరిశుభ్రత పాటిస్తే రోగాలు కూడా రాకుండా వుంటాయని ఆయన వ్యాపారులకు సూచించారు. అనంతరం అక్కడే ఉన్న ఓ హోటల్‌లో ఆయన స్వయంగా టీ కాచి సిబ్బందికి అందించారు.
పాఠశాలల్లో మొక్కల పెంపకం
పర్యావరణ పరిరక్షణకు డివిజన్లోని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు ఐటీడీఏ పీవో ఆపూర్వభరత్ వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక కేజీబీవీలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. వారినుంచి ఆసక్తి గల రంగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులకు ఆయన సివిక్స్ పాఠాలు బోధించారు.
సుందరీకణకు చర్యలు
చింతూరు మండలాన్ని సుందరీకరణ చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో చింతూరుకు చెందిన వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుందరీకరణ చేపట్టేందుకు తగిన ప్రణాళికలు సిధ్థం చేస్తున్నామని, దీనికి సహకరించాలని వ్యాపారులను ఆయన కోరారు. దుకాణాల ఎదుట పరిశభ్రత పాటించాలని, మొక్కలు పెంచాలని పీవో సూచించారు.
చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్
Comments
Please login to add a commentAdd a comment