నాక్ బృందం ప్రకటన
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బి డబల్ ప్లస్ గ్రేడ్‌ను నాక్ బృందం ప్రకటించిందని ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7,8 తేదీల్లో కళాశాలను రెండు రోజులు సందర్శించిన నాక్ చైర్మన్ రమేష్‌శర్మ, కోఆర్డినేటర్ సభ్యులు కులభూషణ్ చందేల్,సుస్మగోస్లే అన్ని ఆంశాలను సమగ్రంగా పరిశీలించారని తెలిపారు. నాలుగు వేల మార్కులకు గాను తమ కళాశాల 2893 మార్కులతో బి డబల్ ప్లస్ గ్రేడ్ సాధించినట్టు చెప్పారు. 2019లో నాక్ బృందం సి గ్రేడ్ ప్రకటించిందని, ప్రస్తుతం బి డబల్ ప్లస్‌కు పెరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పన, ఉన్నత విద్యాభివృద్ధి లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతమైన పాడేరు ప్రభుత్వ కళాశాలకు బి డబల్ ప్లస్ గ్రేడ్ రావడం పెద్ద విజయమన్నారు. బి ప్లస్ గ్రేడ్‌కు ఐదేళ్ల కాలపరిమితిని నాక్ ప్రకటించిందన్నారు. ఈ విజయంలో ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ పి.కోటేశ్వరరావు ,అధ్యాపకులు, అధ్యాపకేతరులు, క్రేటిరియా ఇన్‌చార్జిలు, టెక్నికల్ సిబ్బంది ముఖ్య పాత్ర పోషించారని, వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment