28 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
రంపచోడవరం: రంపచోడవరం డివిజన్‌లో ధాన్యం కొనుగోలుకు 28 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ కల్పశ్రీ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహణ కొరకు సాంకేతిక, ప్రాక్టికల్ శిక్షణను శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూఏఏలు, టెక్నికల్ అసిస్టెంట్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ 2024–25కు ధాన్యం సాధారణ రకం క్వింటాల్ రూ. 2300 , గ్రేడ్ –ఏ ధాన్యం క్వింటాల్ రూ. 2320గా ప్రభుత్వం ధర నిర్ణయించినట్టు తెలిపారు. ఏజెన్సీలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోకుండా జాగ్రత్త వహించాలన్నారు. అడ్డతీగల మండలంలో –3, దేవీపట్నం మండలంలో –4,గంగవరం మండలంలో –4, మారేడుమిల్లి మండలంలో–1, రాజవొమ్మంగిలో–6, రంపచోడవరంలో –6 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.శిక్షణ కార్యక్రమంలో డివిజనల్ పౌర సరఫరాలశాఖ అధికారి విజయభాస్కర్, ఏవోలు, వీఏఏలు, డీఈవోలు పాల్గొన్నారు.
రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ
Comments
Please login to add a commentAdd a comment