దుప్పి కళేబరం స్వాధీనం
విచారణ ప్రారంభించిన అటవీశాఖ అధికారులు
రాజవొమ్మంగి: మండలంలోని రాజవొమ్మంగి అటవీక్షేత్రం పరిధి ముంజవరప్పాడు అటవీ ప్రాంతంలో వన్యప్రాణి దుప్పి కళేబరాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నట్టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాము తెలిపారు. వన్యప్రాణిని వేటాడారన్న సమాచారం మేరకు అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు శనివారం సంఘటన ప్రాంతానికి వెళ్లి దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా కొంతమందిని ప్రశ్నించారు. తమ గ్రామానికి చెందిన ఎవ్వరూ వేటాడలేదని, మాపై నిందలు వేయవద్దంటూ ముంజవరప్పాడు గ్రామానికి చెందిన ఆదివాసీలు శనివారం మూకుమ్మడిగా స్థానిక అటవీక్షేత్ర కార్యాలయానికి తరలి వచ్చారు. ఆధారాలు లేకుండా కేసులు పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. రాత్రి 10 గంటల వరకు కార్యాలయం వద్దనే వేచి ఉన్నారు. కాగా వన్యప్రాణి దుప్పిని వేటాడి హతమార్చిన ఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment