మహారాణిపేట (విశాఖ): నెల్లూరు జిల్లా డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్ ఎం.పెంచలయ్య అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అడిషినల్ డీఎంహెచ్‌వోగా నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ ఓ.ప్రభావతిని అడిషినల్ డీఎంహెచ్‌వో(టీ)గా నియమించారు. ఈమేరకు ప్రభు త్వ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టీ.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
పాము కాటుకు బాలుడి మృతి
అడ్డతీగల: మండలంలో మట్లపాడు గ్రామానికి చెందిన ముర్రం సాయిదొర(6) అనే బాలుడు పాముకాటుకు గురై మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం ఆరుబయట ఆడుకుంటుండగా శరీరం, కళ్లు రంగుమారడాన్ని గమనించిన తండ్రి తమ్మన్నదొర పాముకాటుకు గురైనట్టు గుర్తించారు. వెంటనే అతనిని మండలంలోని ఎల్లవరం పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం వైద్య సిబ్బంది సూచన మేరకు అడ్డతీగల సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు.ఎస్‌ఐ వినోద్ బాలుడు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment