అరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభం
అరకులోయ టౌన్: నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం క్యాంప్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు శనివారం ప్రారంభించారు. స్ధానిక రెంటల్ హౌసింగ్ కాలనీలో ఏర్పాటుచేసిన కార్యాలయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లి పల్లి సుభద్ర, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శోభ సోమేశ్వరి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
రోగుల భోజనంలో రాళ్లు
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడి
అరకులోయ టౌన్: రోగులకు ప్రతిరోజు అందించే అన్నంలో ప్రతిరోజు రాళ్లు ఉంటున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను వైద్యాధికారి హరి తదితరుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులను విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేస్తే 108 అంబులెన్స్‌లో ఎస్.కోట వరకు తీసుకువెళ్లి అక్కడ దించేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకనుంచి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రసవాల వివరాలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యమైన బియ్యంతో రోగులకు భోజనాలు వండి వడ్డిస్తే, ప్రస్తుత కూటమి ప్రబుత్వం మాత్రం నాణ్యతలేని భోజనాలు పెడుతూ రోగులను మరింత అనారోగ్యానికి గురిచేస్తుందన్నారు. రోగులకు మంచి ఆహారాన్ని అందించాలని, కేజీహెచ్‌కు రిఫర్ చేసిన రోగులకు నేరుగా అక్కడికి తీసుకువెళ్లాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment