జీసీసీ గోడౌన్,పెట్రోల్ బంక్‌లో తనిఖీ
జి.మాడుగుల: మండలం కేంద్రంలోని జీసీసీ గోడౌన్ని తనిఖీ చేసి. బియ్యం, ఇతర సరకుల నిల్వలను జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ గురవారం పరిశీలించారు. గోడౌన్ భవనం శిథిలావస్ధలో ఉండడంతో తక్షణమే భవన మరమ్మతులకు అంచనాలతో ప్రతిపాదనలు పంపించమని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. గాంధీనగరంలో గల జీసీసీ అధ్వర్యంలో ఉన్న పెట్రోల్ బంక్‌లను తనిఖీ చేశారు. పెట్రోల్ సేల్స్ రిజిష్టర్ బిల్లులు, లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీసీసీ డీఎం పర్యవేక్షణ లేదని ఆయన చెప్పారు. సమస్యలు, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.బంక్ నిర్వహణపై పలు సూచనలిచ్చారు. ఊబలగరువులో కాఫీ రైతులతో సమావేశమై జీసీసీ కొనుగోలు చేస్తున్న కాఫీ ధరల వివరాలను వివరించారు. కాఫీ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, టూరిజం డైరెక్టర్ రమేష్‌నాయుడు, జీసీసీ డైరెక్టర్ నాగరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్టిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment