జాయింట్ సర్వేను వేగవంతం చేయండి
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ
పాడేరు రూరల్: జాయింట్ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పాడేరు జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ తెలిపారు. ఆయన గురువారం తన కార్యాలయం నుంచి అటవీశాఖ, రెవెన్యూ, బీఎస్‌ఎన్‌ఎల్, జియో, ఎయిర్‌టెల్ సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్ టవర్లు నిర్మాణానికి ఎదురవుతున్న స్థల వివాద సమస్యలపై అధికారులందరూ సమన్వయంతో జాయింట్ సర్వే పక్రియ చేసి పరిష్కరించాలన్నారు. ఇందుకు సంబంధించిన సర్వే వివరాలను వెంటనే ఇవ్వాలని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు, కొయ్యూరు మండలంలో 6 సెంట్లు భూ సమస్య, హుకుంపేట మండలంలో కూడ స్థల సమస్య ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎక్కడ స్థల సమస్యలున్నా తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్‌లను ఆదేశించారు. జియో సెల్ టవర్లు నిర్మాణానికి ఇంకా 14 టవర్లకు అనుమతులు ఇవ్వాలని అధికారులను కోరారు, వీటిలో 8 అనుమతులు ఫారెస్ట్ శాఖ నుంచి రావాల్సి ఉందన్నారు, పెండింగ్ జాయింట్ సర్వేలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సర్వే పనుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే తమ దృష్టికి తీసుకురాలని సూచించారు. సబ్ కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, గిరిజన సంక్షేమ శాఖ ఈఈలు వేణుగోపాల్, డేవిడ్, పంచాయతీరాజ్ ఈఈ కొండయ్యపడాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment