ప్లేట్ నంబరు మార్చి గంజాయి తరలింపు
● 110 కేజీల ప్యాకెట్లతో కారు పట్టివేత ● ఇద్దరు రాజస్థాన్ నిందితుల అరెస్టు
ఎస్.రాయవరం: మండలంలో 110 కిలోల గంజాయి ప్యాకెట్లు పట్టుబడింది. దీని విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని నక్కపల్లి సీఐ రామకృష్ణ గురువారం తెలిపారు. సీఐ వివరాల ప్రకారం... అడ్డురోడ్డు సమీపంలో జాతీయ రహదారి ఆనుకున్న లేఅవుట్ వద్ద అనుమానాస్పదంగా ఆగిఉన్న కారును తనిఖీ చేయడంతో గంజాయి పట్టుబడింది. రాజస్థాన్‌కు చెందిన ఇరువురు కారు (ఏపీ40బీహెచ్3733)లో అడ్డురోడ్డు మీదుగా వేంపాడు టోల్ గేట్ దాటాల్సి ఉండగా, అక్కడ తనిఖీలు చూసి వెనక్కి వచ్చారు. అడ్డురోడ్డు సమీపంలో వెంకటేశ్వర లాడ్జి వద్ద లేఅవుట్‌లో కారు నిలిపారు. ఆగిఉన్న కారును ఎస్.రాయవరం ఇన్‌చార్జిగా బాధ్యత తీసుకున్న, కోటవురట్ల ఎస్‌ఐ రమేష్ తన సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. కారు నంబర్ ప్లేట్ కింద ఒరిజినల్ నంబర్ ఆర్‌జే30సీబీ8575గా గుర్తించారు. అనంతరం కారు డిక్కీలో 22 ప్యాకెట్లలో 110 కేజీల గంజాయి లభించింది. ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై తరచూ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కారు పట్టుబడింది. ఇదేక్రమంలో ఇకపై తనిఖీలు యధావిధిగా ఉంటాయని సీఐ తెలిపారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment