మాచ్‌ఖండ్‌లో విదేశీయుల సందడి
ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, ఒనకఢిల్లీ వారపు సంతలో గురువారం విదేశీయలు సందడి చేశారు.అమెరికా, ఇటలీ, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తదితర దేశాలకు చెందిన విదేశీయులు ఇక్కడి జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు. వించ్ హౌస్‌లో ప్రయాణించిన వారు ప్రత్యేక అనుభూతి పొందారు. ఒనకఢిల్లీ వారపు సంతకు వచ్చిన బోండా,గదబ గిరిజనుల సంస్కృతీ, వస్త్రధారణ వివరాలను తెలుసుకున్నారు. వారి నుంచి పూసలు, రింగులు కొనుగోలు చేశారు. వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
ఒనకఢిల్లీ వారపు సంతలో సందడి చేస్తున్న విదేశీయులు
Comments
Please login to add a commentAdd a comment