మన్యానికి పర్యాటకుల తాకిడి
అరకులోయ టౌన్: సంక్రాంతి పండగ నేపథ్యంలో మన్యంలో పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి నెలకొంది. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌కు దేశ విదేశాల నుంచి భారీగా తరలివస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు సందడి నెలకొంటోంది. ఇక్కడికి వచ్చే సందర్శకుల్లో మహిళలు గిరిజన సంప్రదాయ చీర కట్టు, మగవారు పంచికట్టు, తగపాగ, కండువా వేసుకొని ఫొటోలు తీసుకుంటున్నారు. డప్పు వాయిద్యాల నడుమ గిరిజన సంప్రదాయ నృత్యాల్లో వారు కూడా పాల్గొని డ్యాన్స్ చేస్తున్నారు. వారం రోజులుగా గిరిజన మ్యూజియం కూడా పర్యాటకులతో కళకళలాడుతోంది. దీంతో భారీగా ఆదాయం సమకూరుతోందని నిర్వాహకులు తెలిపారు.
జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతానికి భారీగా పర్యాటకులు తరలివచ్చారు. ప్రత్యేక వాహనాల్లో కుటుంబ సమేతంగా తరలిరావడంతో సందడి నెలకొంది. జలపాతంలో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆట పాటలతో ఆనందంగా గడిపారు.
● కళకళలాడుతున్న సందర్శిత ప్రాంతాలు
Comments
Please login to add a commentAdd a comment