వామనాలంకారంలో అప్పన్న
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా ఐదవరోజు మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వామనాలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి వామనుడి అలంకరణ చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకీలో అధిష్టింజేశారు. ఆళ్వారులను వేరొక పల్లకీలో కొలువుంచి, సింహగిరి మాడ వీధిలో సాయంత్రం తిరువీధి వైభవంగా నిర్వహించారు. భక్తులు తిరువీధిలో స్వామిని దర్శించుకుని, ఆశీస్సులు పొందారు. దేవస్థానం పూర్వ ఈవో, విజయనగరం డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి పల్లకీ మోశారు.
Comments
Please login to add a commentAdd a comment