పీఎంపాలెం: ద్విచక్రవాహనం ముందు చక్రం పంచర్ కావడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివీ.. రెల్లివీధికి చెందిన పి.శ్రీనివాస్, పరిసర ప్రాంతాలకు చెందిన చెందిన అతని మిత్రులు జి.శివ, బసవ షణ్ముఖ సాయికుమార్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల ప్రాంతంలో భీమిలి వైపు వెళ్తున్నారు. శివ బైక్ నడుపుతుండగా.. రుషికొండ బీచ్ రోడ్డులో గ్రాండ్ హోటల్ సమీపంలో ముందు చక్రం పంచర్ అయింది. ప్రమాదంలో ముగ్గురూ కింద పడిపోగా.. శ్రీనివాస్, షణ్ముఖ సాయిలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన శ్రీను ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment